Newdelhi, September 1: ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ (Online Gaming app) ‘డుబియన్’కు (Dubious) ప్రచారకర్తగా ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar) కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ప్రహార్ జన్‌శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ.. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిన్న ముంబైలోని సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ‘డుబియస్’ను సచిన్ ప్రమోట్ చేయడం సరికాదంటూ విమర్శిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆన్‌లైన్ గేమ్‌ను ఎండార్స్ చేస్తున్న సచిన్.. లోకల్ గేమ్ అయిన మట్కాను ఎందుకు వదిలేశారని ఎద్దేవా చేశారు. కాగా, ఎమ్మెల్యే బచ్చూ కాడూ సహా కార్యకర్తలను సచిన్ ఇంటి నుంచి తరలించిన పోలీసులు ఎమ్మెల్యే సహా 22 మందిపై కేసు నమోదు చేశారు.

Rains Update: ఈ తొలివారంలోనే వరుణుడి పలకరింపు.. ఈ నెల సగటు వర్షపాతానికి 9% అటూఇటూగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా.. గత నెలలో మొహం చాటేసిన వానలతో ప్రజల బేజారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)