కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌ నెదర్లాండ్స్‌తో మూడో వన్డేతో క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. ఆఖరి మ్యాచ్‌లో అతడు 14 పరుగులే చేసినా.. వన్డేలో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌..టేలర్‌కు ఘనమైన వీడ్కోలు పలికింది. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో రాస్‌కిది 450వ మ్యాచ్‌ కావడం విశేషం. దక్షిణాఫ్రికాతో గతంలోనే చివరి టెస్ట్‌ ఆడిన టేలర్‌..సొంత గ్రౌండ్‌లో మ్యాచ్‌ ద్వారా కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నాడు. 2006లో తొలి వన్డే ఆడిన అతడు అదే ఏడాది టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు. 112 టెస్ట్‌ల్లో 19 శతకాలతో 7,683 పరుగులు చేశాడు. 236 వన్డేలలో 8,607, 102 టీ20లలో 1,909 రన్స్‌ సాధించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)