టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌లోనే నిష్క్రమించండం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. నమీబియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత జట్టు విజయంతో టోర్నీని ముగించింది. మ్యాచ్ అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో టోర్నీ ఫొటోలను పోస్టు చేసిన కోహ్లీ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని (Kohli Emotional Message) ఇచ్చాడు. మేమందం కలిసి ఒక్కటిగా లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నించాం. దురదృష్టవశాత్తు గమ్యాన్ని చేరుకోలేకపోయాం. మాకంటే ఎక్కువగా ఎవరూ నిరాశ చెంది ఉండరు’’ అని ట్వీట్ చేశాడు. ‘‘మీ నుంచి మాకు అద్భుతమైన మద్దతు లభించింది. అందుకు మేం కృతజ్ఞులం. పుంజుకుని మరింత బలంగా మళ్లీ మీ ముందుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జై హింద్’’ అని కోహ్లీ ఆ పోస్టులో పేర్కొన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)