ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలిం‍ది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో రోహిత్‌కు పాజిటివ్‌ తేలింది. ప్రస్తుతం రోహిత్‌ జట్టు హోటల్‌లో ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా బీసీసీఐ వెల్లడించింది. "శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పాజిటివ్‌ తేలింది. అతడు ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు. అదే విధంగా అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)