ప్ర‌పంచ‌ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌(WTC Final 2023) మ్యాచ్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ప్రాక్టీస్ సెష‌న్‌లో గాయ‌ప‌డ్డాడు. అత‌డి ఎడ‌మ‌చేతి బొట‌న వేలికి చిన్న‌పాటి గాయం అయింది. బ్యాటింగ్ చేస్తుండ‌గా బంతి బొట‌న వేలికి బ‌లంగా తాకింది. దాంతో కాసేపు నొప్పితో బాధ‌ప‌డ్డాడు. వెంట‌నే స‌హాయ సిబ్బంది అత‌డి వేలికి బ్యాండేజీ వేశారు.గాయం చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ రోహిత్ ఆ త‌ర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేశాడు. గాయం తీవ్రత ఎక్కువ కాకూడ‌దనే ఆలోచ‌న‌తో అత‌ను నెట్స్ నుంచి వెళ్లి పోయాడు. దాంతో, కీల‌క పోరుకు హిట్‌మ్యాన్ దూరం అవనున్నాడా? అని ఫ్యాన్స్ అందోళ‌న ప‌డుతున్నారు. అయితే… అత‌డి గాయంపై ఈ రోజు మేనేజ్‌మెంట్ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)