బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ (IND vs AUS) మొదటి రోజు ఆట ముగిసింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (56*) (Rohit Sharma) దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో అర్ధశతకం బాదాడు. తొలి రోజు మరో ఏడు బంతుల్లో ముగుస్తుందనగా.. కేఎల్ రాహుల్‌ (20) మర్ఫీ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్‌ అయ్యాడు. దీంతో 76 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్‌లో రోహిత్‌తో పాటు నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు.

Here's BCCI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)