క్రికెట్ ప్రపంచంలో విషాదం అంటే ఇదే.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అడిలైడ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించినట్టు స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ తెలిపింది. 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. దీనిపై షేన్ వార్న్ చివరి ట్వీట్ చేశాడు. రాడ్ మార్ష్ ని కోల్పవడం చాలా బాధగా ఉందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అయితే ఇంతలోనే ఘోరం జరిగింది.

శుక్ర‌వారం ఉద‌యం త‌న దేశానికే చెందిన సీనియర్ మోస్ట్ క్రికెట‌ర్‌, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీప‌ర్ రామ్ మార్ష్ మృతికి సంతాపం తెలిపిన 12 గంట‌ల్లోనే వార్న్ మృతి చెందాడు. సాటి క్రికెట‌ర్‌కు క‌న్నీటి నివాళి అర్పించిన కొన్ని గంటల్లోనే వార్న్ మృతి చెంద‌డం నిజంగా పెద్ద విషాద‌మే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)