టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో క్యాచ్ ల్లో సెంచరీ మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా క్యాచ్ అందుకోవడం ద్వారా కోహ్లి టెస్ట్‌ల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేశాడు. తద్వారా రాహుల్ ద్రవిడ్(164 టెస్ట్‌ల్లో 210 క్యాచ్‌లు), వీవీఎస్ లక్ష్మణ్(134 మ్యాచ్‌ల్లో 135), సచిన్ టెండూల్కర్(200 మ్యాచ్‌ల్లో 115), సునీల్ గవాస్కర్(125 మ్యాచ్‌ల్లో 108), అజహారుద్దీన్(99 టెస్ట్‌ల్లో 105)ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా(వికెట్‌కీపర్ కాకుండా) నిలిచాడు.
A century of catches in whites for @imVkohli 👏👏#TeamIndia pic.twitter.com/tJIF5QMq1r
— BCCI (@BCCI) January 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)