ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ లీగ్ దశలోనే నిష్క్రమించడం తెలిసిందే. భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడు. తాజాగా, ధావన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. ఆ వీడియోలో... ధావన్ ను తండ్రి కిందపడేసి కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేరడంలో పంజాబ్ కింగ్స్ విఫలమైన నేపథ్యంలో ఆయన ధావన్ ను కామెడీగా ఆ విధంగా కొట్టాడట. ఇతర కుటుంబ సభ్యులు కూడా చూస్తుండగా, ధావన్ కిందపడిపోయి మరీ తండ్రి చేతిలో తన్నులు తినడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ధావన్ ఐపీఎల్ తాజా టోర్నీలో ఫర్వాలేదనిపించేలా రాణించాడు. 14 మ్యాచ్ లు ఆడిన ధావన్ 38.3 సగటుతో 460 పరుగులు సాధించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)