నవంబర్‌ నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌ గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించిన హెడ్‌.. భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ, ఆసీస్‌ స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లను వెనక్కినెట్టి ఈ అవార్డును గెలుచుకున్నాడు. నవంబర్‌లో హెడ్‌.. 220 పరుగులు చేశాడు. ఇందులో ప్రపంచకప్‌ ఫైనల్ లో చేసిన శతకం (137) కూడా ఉంది.

తనకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రావడంపై హెడ్‌ స్పందిస్తూ.. ‘ఏడాదికాలంగా మా జట్టు అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోంది. ఈ జట్టులో నేను కూడా సభ్యుడిని కావడం నాకు గర్వంగా ఉంది. ఇండియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా టూర్‌లతో పాటు భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ చాలా ప్రత్యేకం. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, జట్టు సభ్యులు సహకారం మరువలేనిది. ఐసీసీ అవార్డును గౌరవంగా భావిస్తున్నా. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది.. ’ అని చెప్పాడు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)