జర్మనీ స్టార్ బాక్సర్ ముసా యమక్ మరణం క్రీడాలోకాన్ని దిగ్రాంతికి గురి చేసింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ముసా యమక్ రింగ్‌లోనే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. 38 సంవత్సరాల జర్మన్ ఛాంపియన్ మూసా యమక్ గత శనివారం ఉగాండకి చెందిన హమ్జా వాండెరతో బాక్సింగ్‌కి దిగాడు. వీరిద్దరి మధ్య మూడు సెట్ల మ్యాచ్ జరుగుతుండగా.. సెకండ్ రౌండ్లో వాండెర బలంగా మూసాని బలంగా గుద్దాడు.
దాంతో మూడో రౌండ్ ముందు రింగ్‌లోకి రాగానే మూసా కుప్పకూలినట్లు పలు పత్రికలుధ్రువీకరించాయి. రింగ్‌లోనే మూసా కుప్పకూలడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే బాక్సర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా టర్కిష్ సంతతికి చెందిన యమక్ 2017లో బాక్సింగ్‌లోకి వచ్చినా.. 2021లో డబ్ల్యూబీఫెడ్ ఇంటర్నేషనల్ టైటిల్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. యూరోపియన్, ఆసియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన మూసా యమక్ మరణంపై తోటి బాక్సర్లు తమ సంతాపం ప్రకటించారు.
Turkish-German boxer Musa Yamak, 38, died of a heart attack during a fight that was being broadcast live.
Join for more: @TheCovidTruthNet pic.twitter.com/4HJz2YYmVl
— Trumplican Warrior! (@roy52_richie) May 19, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)