కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంజాయి బ్యాచ్ కారును రాజానగరం సమీపంలోని కెనాల్‌ రోడ్డులో వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల పైనుంచి కారు వెళ్లినా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గంపేట సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కారులో గంజాయి ఉన్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో కేటుగాళ్లను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.విషయం తెలిసిన వెంటనే ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం..తగలబడ్డ లారీ, హార్డ్ వేర్ సామాను తరలిస్తుండగా ఘటన..వీడియో ఇదిగో

Fleeing ganja peddlers try to crush cops under SUV 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)