అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో TDP అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు. ఏజీ వాదనలకు లూథ్రా కౌంటరు వాదనలు వినిపిస్తూ.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

chandrababu (Photo-PTI)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)