కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, లక్ష్మీపురం జగన్నాథగట్టులో "లా యూనివర్సిటీ" పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరించారు. 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు. ఏపీ హైకోర్టులో ఇద్దరు జడ్జిలుగా ప్రమాణస్వీకారం, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం. నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కోరుకుంటున్నాను. రూ.1000 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ యూనివర్సిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మెట్రాలాజీకల్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డ్, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు.
Here's News
కర్నూల్లో నేషనల్ లా యూనివర్సిటీకీ ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. 87 సంవత్సరాల కిందట కుదిరిన శ్రీబాగ్ ఒప్పందంలో ఆ రోజు చెప్పిన మాటకు అనుగుణంగా నేడు అడుగులు పడుతున్నాయి.
- సీఎం
1/3 https://t.co/phoHHzN7nR pic.twitter.com/sqkS2vXiCH
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 14, 2024
ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో హైకోర్టును ఇక్కడ హౌస్ చేయగల సామర్థ్యం ఉన్న వ్యవస్థ అవుతుంది. న్యాయ విభాగాలైన స్టేట్ కంజ్యూమర్ డిస్ప్యూట్స్ రిడర్లెస్ కమీషన్‌ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమీషన్‌ను, ఏపీలేబర్ కమీషన్‌ను, ఏపీ వ్యాట్ అప్లియేట్ ట్రిబ్యునల్‌ను, ఏపీ వక్ఫ్ బోర్డును, 2/3
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)