ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులు అందజేసింది. నేడు(నవంబర్‌1) ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌ చేతుల మీదుగా వివిధ రంగాలకు 27 మంది ఒక్కొక్కరిగా అవార్డులు స్వీకరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటిసారిగా వార్డు, గ్రామ సచివాలయాలను స్థాపించిన ఘనత ఏపీకే దక్కిందని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అవి ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని గవర్నర్‌ చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి గవర్నర్‌, సీఎం అవార్డులను అందజేశారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు ఇచ్చామని చెప్పారు. అవార్డులు అందుకున్న వారంతా మన జాతి సంపద అని అన్నారు.

2023లో వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపికయిన వారి జాబితా:

వ్యవసాయం:

1)పంగి వినీత– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)

2వై.వి.మల్లారెడ్డి– అనంతపురం

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌:

1) యడ్ల గోపాలరావు-రంగస్థల కళాకారుడు-శ్రీకాకుళం

2) తలిసెట్టి మోహన్‌– కలంకారీ– తిరుపతి

3) కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల

4) కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా

5) ఉప్పాడ హ్యాండ్‌ లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ– కాకినాడ

6) ఎస్‌.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా

7)బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు

8)తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం

9)చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం

10)కలీసాహెబీ మహబూబ్‌– షేక్‌ మహబూబ్‌ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం

తెలుగు భాష– సాహిత్యం:

1) ప్రొఫెసర్‌ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి

2) ఖదీర్‌ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)

3) మహెజబీన్‌– నెల్లూరు (ఎచీవ్‌మెంట్‌ అవార్డు)

4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు

5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం

క్రీడలు:

1) పుల్లెల గోపీచంద్‌– గుంటూరు

2) కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం

వైద్యం:

1) ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్‌

2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌– వైయస్సార్‌

మీడియా:

1) గోవిందరాజు చక్రధర్‌– కృష్ణా

2) హెచ్చార్కే– కర్నూలు

సమాజ సేవ:

1)బెజవాడ విల్సన్‌– ఎన్టీఆర్‌

2) శ్యాం మోహన్‌– అంబేద్కర్‌ కోనసీమ– (ఎచీవ్‌మెంట్‌)

3) నిర్మల హృదయ్‌ భవన్‌– ఎన్టీఆర్‌

4)జి. సమరం– ఎన్టీఆర్‌

Here's AP CMO Tweet

Here's CM Jagan Speech

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)