ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ కింగ్ పిన్ తో జగన్ ను పోల్చారు. పాబ్లో ఎస్కోబార్ కొలంబియన్ రాజకీయ నాయకుడు అయ్యి డ్రగ్ కారిడార్‌లు ఏర్పాటు చేశాడని, 30 బిలియన్ డాలర్లు సంపాదించి 1977లో అరెస్టు అయ్యాడని పేర్కొన్న చంద్రబాబు 1982లో కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడని, అమెరికా అరెస్టు చేయాలనుకుంటే ప్రిజన్ అతనే కట్టుకొని అక్కడే ఉంటానన్నాడని చెప్పారు. దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం ఏపీలో జరిగింది, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వెల్లడి
తరువాత 1986లో కొలంబియా న్యాయమంత్రిని చంపాడని, తరువాత 1987లో సుప్రీంకోర్టు పై దాడి చేసి 11 మంది జడ్జిలతో పాటు ఎంతో మందిని చంపాడని వెల్లడించారు. అలా జగన్ కూడా హానికరమైన వ్యక్తి అన్నారు. ఇలాంటివారు రాజకీయాలలో ఉండటం డేంజర్ అన్నారు. మాజీ సీఎం జగన్ టాటా, రిలయన్స్, అదాని కంటే ఎక్కవ డబ్బు సంపాదించాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
Here's Video
#WATCH | In Andhra Pradesh Assembly, CM N Chandrababu Naidu says, "Pablo Escobar is a Colombian drug lord, he is a Narco terrorist. He turned politician and then started his cartel to sell drugs. He earned 30 Billion Dollars at that time, now it’s 90 Billion Dollars worth. He was… pic.twitter.com/z7JGGj05DF
— ANI (@ANI) July 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)