విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో 'సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం' కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామి,అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని, రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని సీఎం వైఎస్‌ జగన్‌ వేదపండితుల మంత్రోచ్ఛారణతో కూడిన సంకల్పం తీసుకొని ఆరు రోజుల క్రితం ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)