విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625 అమలు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రేపు(శుక్రవారం) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల.. ఈ నెల 20వ తేదీ, శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)