CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

Vjy, Oct 19: ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా గురించి చెబుతూ.. గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదని అన్నారు. రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని పేర్కొన్నారు.

అయినా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, అదెలా సాధ్యమైందో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేవలం ముఖ్యమంత్రి మారడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల చేశారు.

వెనుకబడిన కులాలను, వెనుకబడిన వర్గాలను.. వెన్నెముక మాదిరిగా దృఢంగా మారుస్తామూ అని ఏదైతే మాట ఇచ్చామో పాదయాత్ర సందర్భంగా.. ఈ రోజు నేను మీ బిడ్డగా మీ అన్నగా.. మీ తమ్ముడిగా.. సగర్వంగా తలెత్తుకుని చెబుతా ఉన్నాను. ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతీ ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాను. వారి జీవిత ప్రయాణంలో తోడుగా ఉండగలిగామని సగర్వంగా, మీ బిడ్డగా చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాను..

చంద్రబాబుకు ఎదురుదెబ్బ, నవంబర్‌ 1 వరకు రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో బెయిల్‌పై కొనసాగుతున్న విచారణ

ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నాం. ఈరోజు సొంత షాపులు ఉన్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. జగనన్న చేదోడు అనే కార్యక్రమం బటన్ నొక్కి నేరుగా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపడం జరుగుతుంది. వరుసగా నాలుగో ఏడాది అమలు చేస్తూ 3.25 లక్షల మందికి రూ.325 కోట్లు నేరుగా పంపించడం జరుగుతుంది.

ఒక్క చేదోడు పథకం ద్వారా మాత్రమే రూ.1250 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో చేదోడు పథకం ద్వారా మాత్రమే లక్షల మందికి రూ.40 వేల దాకా వాళ్ల కుటుంబాలకు ఇవ్వగలిగాం. గతానికి ఇప్పటికి పోలికలు చూడమని చెబుతున్నా. 52 నెలల కాలంలో ప్రతి అడుగూ ఇదే విధంగా పడింది. అక్షరాలా రూ.2.38 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తున్నాయి.

ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. మీ బిడ్డ హయాంలో, మనందరి ప్రభుత్వంలో మంచి చేయగలిగాం అంటే గతానికి ఇప్పటికి పోలిక చూడమని చెబుతున్నా. చేతి వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న ఇటువంటి వారు బతకలేని పరిస్థితిలోకి వస్తే ఈ వ్యవస్థ కుప్పకూలిపోదా?. ఇటువంటి వారి గురించి ఎవరైనా ఆలోచన చేశారా?. చేదోడు, వాహన మిత్ర, ఇలా స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా ఉంటున్నాం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడకుండా వారందరికీ సహాయం అందించే కార్యక్రమం జరుగుతోంది.

ప్రతి అడుగులోనూ నానానా అంటూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద వర్గాలు అంటూ ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి పేద ఇంట్లో నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటున్నాం. అక్కచెల్లెమ్మల పిల్లలకు సొంత మేనమామగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, తోడుగా నిలబడుతూ ఈ నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మల కోసం వైయస్సార్ ఆసరా ద్వారా చేయి పట్టుకొని నడిపిస్తూ తోడుగా ఉన్నాం.

78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అందించిన సాయం రూ.19,178 కోట్లు. ఈ జనవరిలో మరో రూ.6,500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా కింద ఇవ్వనున్నాం. సున్నా వడ్డీ కింద ఆ ఒక్క పథకానికే ఇచ్చినది రూ.4,969 కోట్లు. 45-60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీకి చెందిన అక్కచెల్లెమ్మలు 26,39,703 మందిని ప్రోత్సహిస్తూ అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్ యూనిలీవర్ లాంటి సంస్థలను తీసుకురావడమే కాకుండా బ్యాంకులతో అనుసంధానం చేసి తోడుగా ఉన్నాం. చేయూత ద్వారా బటన్ నొక్కి మీ బిడ్డ పంపించిన సొమ్ము రూ.14129 కోట్లు.

వచ్చే జనవరిలో వైయస్సార్ చేయూత కింద మరో రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నాం. కాపు నేస్తం కింద 3,57,844 మందికి తోడుగా నిలబడ్డాం. రూ.2,028 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం ద్వారా పేద అక్కచెల్లెమ్మలకు 4.40 లక్షల మందికి 1257 కోట్లు ఇవ్వగలిగాం. మత్స్యకార భరోసా ద్వారా 2,43,394 మందికి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ 538 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 82 వేల చేనేత కుటుంబాలకు ఇప్పటికే ఇచ్చిన సాయం రూ.982 కోట్లు. వాహన మిత్ర ద్వారా 2,75,931 మందికి 1302 కోట్లు బటన్ నొక్కి జమ చేశాం. జగనన్న తోడు ద్వారా 15,87,492 మంది చిరు వ్యాపారులకు రూ.2956 కోట్లు ఇవ్వగలిగాం.

ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ ఇంతకు ముందు జరిగాయా? ఇవ్వగలిగారా? అని ఆలోచన చేయాలి. ఇలా నిజంగానే ఒక ప్రభుత్వం వస్తుంది, ఎక్కడా లంచాలు లేవు, అర్హత ఉంటే చాలు నా ఖాతాలోకి డబ్బు వస్తుందని ఎవరైనా అనుకున్నారా?. ఇవన్నీ 52 నెలల పరిపాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి.

గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా చూడండి. ఇచ్చిన మాటను 52 నెలల పాలనలో నిలబెట్టుకున్నాం. వెనుకబడిన వర్గాల జీవన ప్రయాణంలో తోడుగా ఉన్నాం. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నాం. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు వచ్చి చేరుతున్నాయి. ప్రతీ అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.19178 కోట్లు అందజేస్తున్నాం. నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం.

అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసింది. అ‍ప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలి. అప్పుడు ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు స్థలం ఇవ్వలేదు. కానీ, మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం కొన్ని వేల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం.

చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకొచ్చి ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో పడేశారు. కానీ, మన ప్రభుత్వం మేనిఫెస్టో 99 శాతం హామీలను అమలు చేశాం. చంద్రబాబు రుణమాఫీ కూడా చేయలేదు. బాబు హయాంలో పొదుపు సంఘాలు విలవిల్లాడాయి.

అమరావతి రాజధాని భూములతో మొదలుపెడితే.. స్కిల్‌ స్కాం వరకు అన్నీ కుంభకోణాలే, అవినీతే. చంద్రబాబు ద్వారా నష్టపోయిన పొదుపు సంఘాలకు మీ బిడ్డ అనేక పథకాలతో తోడుగా ఉన్నాడు. పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే 31లక్షల ఇంటి స్థలాలు అందించాం.

గతంలో ఏ పౌర సేవ కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటి వద్దకే పౌరసేవలు అందుతున్నాయి. అప్పుట్లో ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశారు. మీ బిడ్డ పాలనలో 18 మెడికల్‌ కాలేజీలు నిర్మాణం అవుతున్నాయి. మీ బిడ్డ పాలనలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. చికిత్స తర్వాత రోగికి సాయం అందిస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం.

మీ బిడ్డకు అర డజన్‌ టీవీ ఛానెళ్ల సపోర్టు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి టీవీలు లేవు. మీ బిడ్డ నమ్ముకుంది కేవలం పైనే దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు.. రేపు జరగబోయే యుద్ధంలో తేడేళ​ందరూ ఏకమవుతారు. వీళ్లు చెప్పిన అబద్దాలు నమ్మకండి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా ఆలోచించండి.