ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణ శివార్లలోని ఉడ్ కాంప్లెక్స్ వద్ద నిలిపి ఉంచిన 8 బస్సులు దగ్ధమయ్యాయి. ఇవన్నీ కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సులుగా భావిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ వద్ద చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల్లోనే వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఉడ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అప్పటికే 8 బస్సులు కాలిపోయాయి. ఈ ప్రమాదంతో ఉడ్ కాంప్లెక్స్ పరిసరాల్లోని వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కాగా, ఉడ్ కాంప్లెక్స్ వద్ద మరో 20 వరకు బస్సులు నిలిపి ఉన్నాయి. జరిగిన నష్టం రూ.6 కోట్ల వరకు ఉంటుందని ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా డిమాండ్ లేకపోవడంతో బస్సులను ఇక్కడ నిలిపి ఉంచామని ట్రావెల్స్ కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)