గత ఏడాది రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్న ఆర్కే.. సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్సార్‌సీపీ అధిష్టానం నియమించింది. ఈ తరుణంలో.. నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చనే వార్తలు వస్తున్నాయి.గత డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాల పేరిట వైఎస్సార్‌సీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధి కాకముందే తిరిగి సొంత గూటికి చేరారు.
Here's Video
#BREAKINGNEWS: Alla Ramakrishna Reddy who quit @YSRCParty two months ago and joined the @INC_Andhra called on Chief Minister @ysjagan at his residence in #Tadepalli. He is likely to join back #YSRCP and contest from #Mangalagiri.
Follow us @NewsMeter_In @CoreenaSuares2 pic.twitter.com/RUrq8wUpIr
— Sistla Dakshina Murthy (@Murthy_BZA) February 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)