తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు.. చుట్టూ పక్కల దుకాణాలకు వ్యాపిస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. మాడవీధిలో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన చోటే గోవిందరాజ స్వామి రథం ఉంది.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)