గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రి దిగువన కొండచరియలు విరిగిపడ్డాయి. కేశఖండన శాల సమీపంలో ఈ ఘటన జరిగింది.భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు పడిన ప్రదేశంలో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. కొండచరియలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలను మొదలు పెట్టారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈవో భ్రమరాంబ. ఆలయం ముందు నుంచి వెళ్లే కుమ్మరిపాలెం-రథం సెంటర్ మధ్య రోడ్డును మూసివేశారు. వర్షాలు కొనసాగుతుండటంతో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదసమయంలో భక్తులెవరూ లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Landslides occurred below VIjayawada Indrakiladri

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)