ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా 166 మందికి కరోనా సోకింది. గుంటూరు, కృష్ణాలలో ఒక్కొక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,74,250 పాజిటివ్ కేసులకు గాను…20,58,601 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,495 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,154గా ఉందని తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 91 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,13,27,1317 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 12. చిత్తూరు 28. ఈస్ట్ గోదావరి 10. గుంటూరు 10. వైఎస్ఆర్ కడప 03. కృష్ణా 21. కర్నూలు 09. నెల్లూరు 13. ప్రకాశం 06. శ్రీకాకుళం 03. విశాఖపట్టణం 31. విజయనగరం 08. వెస్ట్ గోదావరి 12. మొత్తం : 166

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)