ఏపీలో గడచిన 24 గంటల్లో 31,040 కరోనా పరీక్షలు నిర్వహించగా, 168 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 301 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,906 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,54,056 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,425 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,425కి పెరిగింది.
#COVIDUpdates: 19/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,68,011 పాజిటివ్ కేసు లకు గాను
*20,51,161 మంది డిశ్చార్జ్ కాగా
*14,425 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,425#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HOPIXdQ9mJ
— ArogyaAndhra (@ArogyaAndhra) November 19, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)