ఏపీలో కొత్తగా 184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైద్యసిబ్బంది 29,595 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్‌ బారిన పడి కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 14,443కి చేరింది. ఇప్పటి వరకు 20,56, 501 మంది బాధితులు కొవిడ్‌ బారిన నుంచి కోలుకున్నారని వివరించారు. చిత్తూరులో 39 మంది, గుంటూరులో 20 మంది , ఈస్ట్‌గోదావరిలో 14, వెస్ట్‌ గోదావరిలో 27మంది, అనంతపురంలో 11, కృష్ణాలో 20 , విశాఖపట్నంలో 28 మంది అత్యధికంగా కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,149

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)