ఏపీలో గడచిన 24 గంటల్లో 30,747 శాంపిల్స్ పరీక్షించగా 184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో 22, విశాఖ జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,036 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 20,57,573 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,008 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,455కి పెరిగింది.
ఇక విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో ఒమిక్రాన్ వేరియంట్ పుకార్ల కలకలం రేగింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు కనిపించాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, సదరు వ్యక్తిలో ఒమిక్రాన్‌కు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదని వైద్యులు స్పష్టం చేశారు.
#COVIDUpdates: 07/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,71,141 పాజిటివ్ కేసు లకు గాను
*20,54,678 మంది డిశ్చార్జ్ కాగా
*14,455 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,008#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/w85OPzXdt8
— ArogyaAndhra (@ArogyaAndhra) December 7, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)