ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 26,514 కరోనా పరీక్షలు నిర్వహించగా, 191 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 41 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 37 కేసులను గుర్తించారు. అదే సమయంలో 416 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,391 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 20,50,239 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా2,734 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,418కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)