ఏపీలో గడచిన 24 గంటల్లో 27,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 295 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 69 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 68, చిత్తూరు జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 560 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,872 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,44,692 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,830 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,350కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)