ఏపీలో గడచిన 24 గంటల్లో 36,373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 53, విశాఖ జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం, అనంతపురం జిల్లాలలో 3 కేసుల చొప్పున గుర్తించారు. అదే సమయంలో 367 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,556 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,49,338 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 3,830 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,388కి పెరిగింది.
#COVIDUpdates: 04/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,64,661 పాజిటివ్ కేసు లకు గాను
*20,46,443 మంది డిశ్చార్జ్ కాగా
*14,388 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,830#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/WB6sCMr4FE
— ArogyaAndhra (@ArogyaAndhra) November 4, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)