ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. కొత్తగా మరో 310 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 23,022 శాంపిల్స్ పరీక్షించారు. తాజాగా కొవిడ్ నుంచి 994 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,258 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొవిడ్‌తో కొత్తగా చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
కొత్తగా నమోదైన కొవిడ్ కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 54 కేసులు రాగా.. నెల్లూరులో 51, చిత్తూరు 45, విశాఖ 42, తూర్పుగోదావరి 38, ప్రకాశం 23 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్నిపరిశీలిస్తే.. 2.87కోట్ల శాంపిల్స్ పరీక్షించగా.. 20,57,562 పాజిటివ్ కేసులు రాగా.. 14,256 మంది మరణించారు. కొవిడ్ బారిన పడినవారిలో 20,36,048 మంది కోలుకోగా.. ప్రస్తుతం 7258 క్రియాశీల కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 11/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,54,667 పాజిటివ్ కేసు లకు గాను
*20,33,153 మంది డిశ్చార్జ్ కాగా
*14,256 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,258#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vC193cs7nV
— ArogyaAndhra (@ArogyaAndhra) October 11, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)