Corona in AP: ఏపీలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు 19 మంది విద్యార్థులకు కరోనా, గత 24 గంటల్లో 334 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 50 కేసులు నమోదు కాగా... కడప, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 4 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో 95 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 50 కేసులు నమోదు కాగా... కడప, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 4 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో 95 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,77,942కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 20,61,927 మంది కరోనా నుంచి కోలుకోగా... 14,499 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
విజయనగరం జిల్లాలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జిల్లాలోని కొత్త వలస జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మందికి పరీక్షలు చేయగా ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కరోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెండు రొజుల పాటు స్కూలుకు సెలవు ప్రకటించారు.
#COVIDUpdates: 04/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,75,047 పాజిటివ్ కేసు లకు గాను
*20,59,032 మంది డిశ్చార్జ్ కాగా
*14,499 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,516#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/AwSCaxIto3
— ArogyaAndhra (@ArogyaAndhra) January 4, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 04, 2022 07:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

