ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 19,241 శాంపిల్స్ పరీక్షించగా, 335 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా... తూర్పు గోదావరి జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు గుర్తించారు. అదే సమయంలో 936 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,285 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,94,818 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,754 మందికి చికిత్స జరుగుతోంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,713కి పెరిగింది.
#COVIDUpdates: 20/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,285 పాజిటివ్ కేసు లకు గాను
*22,94,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,713 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,754#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dXNEzK7RHe
— ArogyaAndhra (@ArogyaAndhra) February 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)