COVID in AP: ఏపీలో కొత్తగా 4,108 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు, చిత్తూరు జిల్లాలో 1,004 కేసులు

ఏపీలో కొన్నిరోజుల వ్యవధిలోనే కరోనా రోజువారీ కేసుల సంఖ్య అధికమైంది. తాజాగా మరోసారి 4 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22,882 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,108 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,004 కేసులు గుర్తించారు.

COVID in AP: ఏపీలో కొత్తగా 4,108 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు, చిత్తూరు జిల్లాలో 1,004 కేసులు
Coronavirus in India (Photo Credits: PTI)

ఏపీలో కొన్నిరోజుల వ్యవధిలోనే కరోనా రోజువారీ కేసుల సంఖ్య అధికమైంది. తాజాగా మరోసారి 4 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 22,882 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,108 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,004 కేసులు గుర్తించారు. అదే సమయంలో 696 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

గత 24 గంటల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,10,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,65,696 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,182 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 14,510 మంది కరోనాతో మరణించారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 17, 2022 08:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).