ఏపీలో గడచిన 24 గంటల్లో 39,604 కరోనా పరీక్షలు నిర్వహించగా, 481 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 157 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 76, కృష్ణా జిల్లాలో 52, గుంటూరు జిల్లాలో 39, విశాఖ జిల్లాలో 38 కేసులు వెలుగు చూశాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 385 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,65,716 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,46,512 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,837 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,367కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)