ఏపీలో గడచిన 24 గంటల్లో 27,233 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 95 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,60,061 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,432 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,481కి పెరిగింది.
#COVIDUpdates: As on 21st December, 2021 10:00AM
COVID Positives: 20,73,079
Discharged: 20,57,166
Deceased: 14,481
Active Cases: 1,432#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/9gDdvrJyY4
— ArogyaAndhra (@ArogyaAndhra) December 21, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)