రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విశాఖలో డీప్‌టెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్క కియా పరిశ్రమ రాయలసీమ ముఖచిత్రాన్నే మార్చిందన్నారు. చంద్రబాబు విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు.. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతీమాట నిజమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Nara Lokesh on Chandrababu Vision 2020
దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు
చంద్రబాబు విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు.. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతీమాట నిజమైంది - మంత్రి నారా లోకేష్ pic.twitter.com/DUEP1JhdnJ
— Telugu Scribe (@TeluguScribe) January 8, 2025
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటుతో రాష్ట్రం నడుస్తుంది. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందించారు. #APWelcomesModiji #Modi4ViksitAndhra #NaraLokesh#AndhraPradesh pic.twitter.com/8qkQWEKjtL
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2025
రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు గారు నెరవేర్చుతున్నారు. ఒకేసారి వెయ్యి పెన్షన్ పెంచారు, మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు, దీపం పధకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. త్వరలోనే మిగతా హామీలు కూడా అమలు చేస్తున్నారు.… pic.twitter.com/IB7nixgcZU
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2025
ప్రభుత్వ కొనసాగింపు అభివృద్ధికి ఎంతో ముఖ్యం. మూడు సార్లు వరుసగా గెలిచిన ప్రధాని మోదీ గారి నాయకత్వం అందుకు నిదర్శనం. మన రాష్ట్రంలో 2014-19 మధ్య అభివృద్ధి పరుగులు పెట్టింది, తరువాత ప్రభుత్వం మారటంతో విధ్వంసం జరిగింది. ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే అభివృద్ధి సాధ్య పడుతుంది.… pic.twitter.com/776ZYLUFdp
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)