కొత్త సంవత్సర వేడుకల సమయంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. కాగా మంత్రి విడదల రజనిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులోని విద్యానగర్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
Here's Videos
మంత్రి విడదల రజనీ కార్యాలయం పగలకోట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
గుంటూరులోని విధ్యానగర్లో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ కార్యాలయం పగలకోట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.
ప్లేక్సీలు తగలబెట్టి మంత్రి కార్యాలయం పై రాళ్లు రువ్విన టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు అడ్డుకున్న తోసేసి… pic.twitter.com/3sgGe7Rb3n
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)