ఏపీలో గడచిన 24 గంటల్లో 30,578 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,605 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 642 కొత్త కేసులు వెల్లడి కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 539, గుంటూరు జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 501 కేసులు గుర్తించారు. అదే సమయంలో 11,729 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,641కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 22,93,171 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,85,042 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా లక్ష లోపే నమోదైంది. ప్రస్తుతం 93,488 మంది చికిత్స పొందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)