తిరుపతిలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. చిత్తూరు-2 డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. ముందు వెళుతున్న బుల్డోజర్‌ను వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు దాటుతూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

APRTC bus hits bulldozer in Tirupati

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)