ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాలీ లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మి నగర్ వద్ద రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ట్రాలీ లారీని ఎర్టిగా కారు అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న రాచభత్తుని భాగ్యశ్రీ (26), బొమ్మ కమలాదేవి (53), నాగ నితిన్ కుమార్ (5) అక్కడికక్కడే చనిపోయారు. దుర్గా వంశీతో పాటు బాలుడు నాగ షణ్ముక్ తీవ్రంగా గాయపడ్డారు. హర్యానాలో బోల్తాపడిన స్కూలు బస్సు, 40 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
ప్రమాదంపై సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో వెలికి తీశామని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మృతులు రాజవోలుకు చెందినవారని, హైదరాబాద్ కు వెళ్లి తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.
Here's Video
Dwaraka Tirumala లో ఘోర రోడ్డు ప్రమాదం!#AndhraPradesh #DwarakaTirumala #RoadAccident #NTVNews #NTVTelugu pic.twitter.com/7byB42HWoR
— NTV Telugu (@NtvTeluguLive) July 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)