ఏపీలో గోదావరి వరదలో ఆలయం కొట్టుకుపోయింది... తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో గోదావరి ఎడమగట్టున 15 ఏళ్ల క్రితం స్థానికులు వనదుర్గ ఆలయాన్ని నిర్మించి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. కాగా శ్రావణమాసం తొలి శుక్రవారం అమ్మవారిని మహిళలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయం పక్కకు ఒరగడంతో భయాందోళనలకు గురై అందరూ బయటకు వచ్చారు. సాయంత్రానికి ఆలయం మరింతగా నీటిలోకి ఒరిగి, మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్లే తీరం కోతకు గురై ఇలా జరిగిందని గ్రామస్థులు వాపోయారు. వీడియో ఇదే..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)