Vontimitta Sita Rama Kalyanam: ఏప్రిల్ 26 న ఒంటిమిట్టకు వైయస్ జగన్, కోదండ రాముడి కల్యాణానికి హాజరు కానున్న ఏపీ సీఎం, ఈ నెల 21 నుంచి 29 వరకు కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 26 న కడప జిల్లాలోని ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం కు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి.

Vontimitta Sita Rama Kalyanam: ఏప్రిల్ 26 న ఒంటిమిట్టకు వైయస్ జగన్, కోదండ రాముడి కల్యాణానికి హాజరు కానున్న ఏపీ సీఎం, ఈ నెల 21 నుంచి 29 వరకు కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
AP Chief Minister Y.S. Jagan Mohan Reddy (photo-Twitter)

ఇందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోదండ రాముడి కల్యాణం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్‌ రెడ్డి వెల్లడించారు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనల మేరకు కల్యాణ వేదిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 5 వేల మందికి కల్యాణోత్సవ పాసులు జారీ చేస్తామన్నారు.

Here's Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 10, 2021 05:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).