అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్‌ వేశారు. బాలకృష్ణకు మద్దతిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కూడా ఆయనతో కలిసి విజిల్స్‌ వేశారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు విసిరారు. అంతటితో ఆగకుండా ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో​ ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సస్పెండ్‌ చేశారు. నిన్న కూడా సభలో బాలకృష్ణ స్పీకర్‌ పోడియం వద్ద మీసం మెలేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పనిని మొదటి తప్పుగా పరిగణిస్తూ స్పీకర్‌ ఆయనకు వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Credits: X

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)