నేడు ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు.రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ట్విట్టర్లో #HBDYSJagan, Happy Birthday Anna హ్యాట్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ హ్యాష్ ట్యాగ్స్ వేదికగా సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
Here's Tweets
వైయస్ జగన్ అందరి వాడు#HBDYSJagan pic.twitter.com/Mv8PTEX3ZE
— YSR Congress Party (@YSRCParty) December 20, 2022
Warmest birthday wishes to the visionary leader Hon' Chief Minister @ysjagan sir.
Wish you a happy and prosperous journey ahead as you lead our state to the pinnacle of success! #HBDYSJagan pic.twitter.com/fNEXMpgRZg
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)