భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను త్వరలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల నాయకులతో శనివారం మాట్లాడారు. టీడీపీ శ్రేణులు బాధితులు ఆదుకోవాలని సూచించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సహాయ, సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. వరద ప్రాంతాల్లోని పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వాలని సూచించారు. ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందుల పంపిణీ జరుగుతుందని , పార్టీ శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయని చంద్రబాబు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)