బాపట్ల జిల్లా లోని బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. దీనిపై స్థానిక టిడిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చశారు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. కాగా ఈ ఘటనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.
అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైసీపీ అహంకారానికి నిదర్శనమన్నారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామని అన్నారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్.. అంటూ లోకేష్ నినదించారు.
Here's News
Miscreants #vandalised Bronze Statue of Late N.T. Rama Rao (#NTR), founder of #TDP, Ex-CM of Andhra Pradesh at Bhartipudi (V) in Bapatla (D) on intervening night Wed-Thursday. TDP cadre staging protests.
Party President #Nara #ChandrababuNaidu, & GS #Lokesh condemned pic.twitter.com/WC5MvBALZh
— Sambasiva Rao Madamanchi (@madamanchis) December 7, 2023
బాపట్ల మండలం భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమి భయంతో వైకాపా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని వైకాపా ఆయన విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేదు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన… pic.twitter.com/ktyIOsLAqp
— Lokesh Nara (@naralokesh) December 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)