టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై తనకు భయంగా ఉందని ఆయన సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జైలులో మంగళవారం సాయంత్రం చంద్రబాబును భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిశారు అనంతరం జైలు వద్ద భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... జైలు నంచి త్వరగా బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తానని చంద్రబాబు అన్నారు. ప్రజలే తనకు ముఖ్యమని ఆయన ఎప్పుడూ అనేవారు. ప్రజల హక్కుల కోసమే పోరాటం చేస్తున్నారు. తాను బాగున్నానని.. ఎవరూ భయపడవద్దని చంద్రబాబు చెప్పారు.
మా కుటుంబం ఎప్పుడూ ప్రజలు, క్యాడర్ కోసం నిలుస్తుంది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇది ..ఏమీ కాదు. ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడూ అనే వారు. మన రాష్ట్రం.. దేశంలో నెంబర్‌వన్‌గా ఉండాలని అనేవారు. మా కుటుంబ సభ్యులకు ఇది చాలా కష్టకాలం. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి’’ అని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ను తీసుకెళ్లి పెట్టారు. చంద్రబాబును వీడి బయటకు వస్తుంటే నా మనసు చలించింది. ఆయన కోసం నా ఆత్మ వదిలేసి వచ్చా. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది.. ధైర్యంగా ఉన్నారు. చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి చాలా దారుణం. ఇది మాకు ఒక సవాల్’’ అంటూ భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు.
Here's Video
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చిన భువనేశ్వరి గారు మీడియాతో మాట్లాడుతూ... "తనలో ఒక భాగాన్ని లోపల వదిలేసి వచ్చినట్టుంది" అంటూ ఆవేదనతో అన్న మాట విన్నవారి మనసుల్ని కదిలించేస్తోంది
#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu pic.twitter.com/SWSjHUuG0n
— Telugu Desam Party (@JaiTDP) September 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)