ఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ మద్దతుగా నినాదాలతో తిరుపతి పట్టణం గురువారం మారుమోగింది. కృష్ణాపురం పోలీసు స్టేషన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థులు, మేధావులు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. అడుగడుగున ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వేల మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రాయలసీమ మేధావులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు, 3రాజధానులకు మద్దతు తెలుపుతూ తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీ. భారీగా తరలివచ్చిన ప్రజలు. #3Capitals #Tirupati#AFC pic.twitter.com/ub3sfYSS5o
— Andhra Fact Check (@AndhraFactCheck) December 16, 2021
Students in large numbers take part in a rally in support of @ysjagan govt’s 3 capitals plan in Tirupati today. Several groups from the Rayalaseema region supporting govt’s 3 capitals move planned a public meeting on Dec 18. 1/2 pic.twitter.com/6ehnKBTMaZ
— SNV Sudhir (@sudhirjourno) December 16, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)