మహారాష్ట్రలో కరోనా మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరోనా బాధితులకు ఆక్సిజన్‌తోపాటు వెంటిలేటర్లు కూడా లభించడంలేదు. దీంతో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సాయం కోరారు. కాగా, వెంటనే 300 వెంటిలేటర్లు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై నితిన్‌ గడ్కరీ ఏపీ ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి నితిన్‌ గడ్కరీ ఫోన్‌ చేసి సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలిసిన అనంతరం సోషల్‌ మీడియాలో కూడా అనేక మంది ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఇలాంటి గడ్డు పరిస్థితిలో సాయం చేసి మానవత్వాన్ని చాటిన జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలంటూ అనేక రకాల పోస్టులు సోషల్‌ మీడియాలో కన్పించాయి.

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)